నలుపు షర్ట్స్‌తో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

టిడిపి కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే తప్పకుండా మద్దతిస్తామని చెప్పారు. అయితే తెలంగాణ టిడిపి నేతలు అవిశ్వాసం ముసుగులో తప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దని తెలంగాణ కోసం తమతో పాటు అసెంబ్లీలో గళం కలపాలని సూచించారు. టిటిడిపి కేవలం కెసిఆర్, టిఆర్ఎస్‌పై విమర్శలు చేయడమే లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలూ తమతో కలిసి రావాలన్నారు. ఎంపీలను ఆదర్శంగా తీసుకొని అసెంబ్లీలో కొట్లాడాలని సూచించారు. ఎంపీలకు లేని అధిష్టానం మీకా అని ప్రశ్నించారు.
యుపి ముఖ్యమంత్రి మాయావతిని ఆదర్శంగా తీసుకొని సిఎం తెలంగాణపై తీర్మానం చేయాలని, గతంలో ఇచ్చిన మాట మేరకు బాబు తీర్మానానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం డిసెంబర్ 9 నాటి మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కేసుల విషయంలో తాము ఎన్నిసార్లు కలిసినా ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉందన్నారు. అసెంబ్లీలో రాజేశ్వర్ రెడ్డి సంతాప తీర్మానం సమయంలో టిడిపి తీరు సభ హుందాతనాన్ని తగ్గించిందన్నారు.












Click it and Unblock the Notifications