జగన్ మాటే 21 మంది బాట, అవిశ్వాసానికే ఓటు: పిల్లి

అవిశ్వాసం ఎవరు పెట్టారన్నది ముఖ్యం కాదని, రైతు సమస్యలపై ప్రతిపాదించారు కాబట్టి మద్దతివ్వాలని జగన్ చెప్పారని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తమ మధ్య విభేదాలు లేవని, తామంతా ఒకే మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. కాగా, కొండా సురేఖ ఈ సమావేశానికి రాలేదు. అయితే, ఆమె భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి సమావేశానికి వచ్చారు. దీన్నిబట్టి కొండా సురేఖ కూడా జగన్ వెంటే ఉండవచ్చునని అంటున్నారు. కానీ, సురేఖ జగన్ ఫోన్ చేసినా పలకలేదని ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో వార్త వచ్చింది. అవిశ్వాసానికి మద్దతిస్తామని, దానివల్ల సంభవించే తదుపరి పరిణామాలను ఎదుర్కోవాడనికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు.












Click it and Unblock the Notifications