శ్రీలక్ష్మి పేరు లేకుండా గాలి కేసులో సిబిఐ చార్జిషీట్

మొత్తం 1100 పేజీల చార్జిషీట్‌ను ఆరు ట్రంకు బాక్సుల్లో తీసుకుని వచ్చి సిబిఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. వివిధ సెక్షన్ల కింద ముగ్గురిపై అభియోగాలు మోపుతూ చార్జిషీట్ దాఖలైంది. వంద పేజీల్లో చార్జిషీట్ ఉండగా, వేయి పేజీల్లో అనుబంధ పత్రాలున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు సిబిఐ అభియోగం మోపింది. ఒక్క చోట అనుమతి పొంది మరో చోట తవ్వకాలు జరిపారని కూడా ఆరోపించింది. ఒఎంసి నుంచి 34 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయగా, 29 లక్షల టన్నుల ఖనిజం అక్రమ రవాణా జరిగిందని సిబిఐ ఆరోపించింది. గనుల పర్మిట్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, కస్టమ్స్ రవాణా అధికారుల వాంగ్మూలాలు తదితర పత్రాలను చార్జిషీట్‌కు జత చేశారు.












Click it and Unblock the Notifications