జగన్ ఎమ్మెల్యేలతో పోల్చుకుంటున్న చిరు ఎమ్మెల్యేలు

కాగా, అవిశ్వాసంపై తీర్మానంపై చర్చను స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిఎసి సమావేశంలో ఖరారు చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని సోమవారంనాడు చర్చకు చేపట్టే అవకాశం ఉంది. అదే రోజు ఓటింగు కూడా జరుగుతుంది. కరువుపై చర్చ ముగిసిన తర్వాతనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. పది గంటలపాటు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాలను మరో ఐదు రోజులు పొడగించాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని అధికార కాంగ్రెసు పార్టీ తిరస్కరించింది.
ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేసే విషయంపై ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చిరంజీవితో మాట్లాడారు. సాంకేతికంగా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు చిరంజీవి విప్ జారీ చేయాల్సి ఉంటుంది. కాగా, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తమ శాసనసభ్యులకు విప్ జారీ చేశాయి.












Click it and Unblock the Notifications