జగన్‌కు ఎదురుతిరిగిన సత్యవతి, ప్రభుత్వానికి బాసట

తనకు వైయస్ రాజశేఖర రెడ్డి సీటు ఇవ్వడం వల్లనే గెలిచానని ఆమె చెప్పారు. వైయస్ జగన్ అంటే తనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని, అయితే ప్రభుత్వాన్ని కూల్చడంలో తాను భాగస్వామిని కాబోనని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ పథకాలనే కొనసాగిస్తున్నారని, ప్రజలకు అవి చేరువగా ఉన్నాయని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే, మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు బాబూరావుతో చర్చలు జరిపారు. మరో ఇద్దరు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రభుత్వం జగన్ ఆపరేషన్‌ను చేపట్టింది. జగన్ వైపు పది మందికి మించి శాసనసభ్యులు లేకుండా చూడాలనే ప్రయత్నంలో ఉంది.












Click it and Unblock the Notifications