ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్, కొత్త ఎమ్మెల్యేల కోసం వేట

డబుల్ గేమ్ ఆడేవారు తన వద్దకు రావద్దని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం వల్ల అనర్హతకు గురై ఉప ఎన్నికలు వస్తే తాను చూసుకుంటానని ఆయన వారితో అన్నారు. తాను అనర్హత వేటుకు భయపడబోమని, అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తామని సమావేశానంతరం శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. శనివారంనాటి సమావేశానికి 22 మంది శానససభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టడానికి కొత్త శాసనసభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు కూడా జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరో 12 మందిని తన వైపు రాబట్టుకోగలిగితే ప్రభుత్వాన్ని పడగొట్టడం సులభం అవుతుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications