మేయర్ పదవికి బండ కార్తిక రెడ్డి రాజీనామా

మేయర్ పదవి విషయంలో గత కొద్ది రోజులుగా మజ్లీస్‌కు, కాంగ్రెసుకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. రాజీనామా చేయడానికి తొలుత కార్తిక రెడ్డి కొంత మొరాయించారు. పదవిలో కొనసాగడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసింది. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగడానికి మజ్లీస్ శాసనసభ్యుల మద్దతు అవసరం కావడంతో సంబంధాలు బెడిసికొట్టకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో వారు కార్తిక రెడ్డి చేత రాజీనామా చేయించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కార్తిక రెడ్డి, నగర శానససభ్యులు, మంత్రుల సమక్షంలో మేయర్ పదవిని మజ్లీస్‌కు అప్పగించనున్నట్లు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ నెల 17వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో కొత్త మేయరు ఎన్నిక జరుగుతుంది.












Click it and Unblock the Notifications