జగన్ హంతకుడుకాదన్నాం:విజయమ్మకు బొత్స కౌంటర్

కాంగ్రెసు ఎప్పుడూ వైయస్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదన్నారు. వైయస్‌కు అధిష్టానం ఎన్నో పదవులు కట్టబెట్టిందన్నారు. మా దివంగత నేత భార్యగా ఆమె అంటే మాకు గౌరవం ఉందన్నారు. వైయస్ అంటే మాకు ఎంత గౌరవమో ఆమెకు తెలుసునన్నారు. కానీ సానుభూతి పొందడం కోసం అవకాశం వాడుకోవద్దన్నారు. కావాలంటే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. జగన్ కుర్చీ మీద మోజుతోనే పార్టీ వీడి పోయారన్నారు. ఆయన కుర్చీ కోసం పాకులాడారా లేదా అనేది ప్రజలకు తెలుసునన్నారు. వైయస్ తెచ్చిన ప్రభుత్వం అంటూ టిడిపికి అండగా నిలుస్తుంది మీరని నిలదీశారు.
చంద్రబాబు వైయస్‌ను విమర్శించినప్పుడు మేం ఖండించలేదనడం సరికాదన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలే ఏమీ మాట్లాడలేదన్నారు. కాగా బొత్స వ్యాఖ్యలకు విజయమ్మ స్పందించారు. జగన్ ఎప్పుడూ ముఖ్యమంత్రి పీఠం కోసం సోనియాను అడగలేదని ఓదార్పు యాత్ర కోసం మాత్రమే అనుమతి అడిగారన్నారు. సిఎం సీటును జగన్ ఎప్పుడూ కోరలేదన్నారు.












Click it and Unblock the Notifications