నగ్నంగా ఉండకండి, నా ఓటు వల్ల ఏమీ కాదు: జెపి

Loksatta chief Jayaprakash Narayana
హైదరాబాద్: ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి కానీ నగ్నంగా ఉండకూడదని లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర రాజకీయ సంక్షోభం రాత్రంతా తనను, తన అనుచరులను కలిచి వేసిందన్నారు. తన ఓటు వల్ల ప్రభుత్వం పడిపోయేది లేదు నిలబడేది లేదన్నారు. అక్రమార్జన లేకుండా రాజకీయాలు నడవలేని పరిస్థితి రాష్ట్రంలో తీసుకు వచ్చామన్నారు. వికృతమైన రాజకీయ సంసృతి రాజ్యమేలుతున్న పరిస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. ఇప్పుడు రాజకీయాలు నడవాలంటే ప్రజలకు డబ్బులిచ్చినా చాలదన్నారు. రాష్ట్రం రెండు మౌలికా సంక్షోభాలు ఎదుర్కొంటుందన్నారు. అక్రమార్జన రాజకీయాలకు మన రాష్ట్రంలోనే పునాది పడిందన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సంవత్సరం క్రితం ముళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్నారన్నారు.

కొన్ని విలువల కోసం సిఎం కిరణ్ తహతహలాడుతున్నారన్నారు. నిజాయితీని కాపాడటం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. అన్ని పార్టీల్లో నిజాయితీపరులు ఉన్నారన్నారు. రాజీవ్ యువ కిరణాలు మంచి పథకమని అందులో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకప్పుడు పార్టీలంటే గౌరవం ఉండేదని ఇప్పుడు నాయకులంటే గౌరవం పోయిందన్నారు. కేబినెట్‌లో సమన్వయం కొరవడిందన్నారు. సభ విధాన నిర్ణయాలపై చర్చ జరగాలన్నారు. నాయకులు పారదర్శకంగా ఉండాలి కానీ నగ్నంగా ఉండకూడదన్నారు. రాజకీయాలు అంటే అధికారమే అన్న చందంగా కనిపిస్తోందన్నారు. నాయకులు తప్పు చేస్తే శిక్ష విధించాలని వారి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం చేస్తున్నామని మంత్రులు చెప్పగలరా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో ఉన్న వారిని జనం తిట్టిపోస్తున్నారన్నారు. అధికారం పూర్తిగా కొందరి చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుందన్నారు. అన్ని అధికారాలు మన చేతిలో పెట్టుకొని పాలన సాగిస్తామంటే కుదరదన్నారు. విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందన్నారు. మనం సృష్టించిన సంక్షోభానికి మనమే బలవుతున్నామన్నారు. విద్యలో ఎపి అట్టడుగు స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజల బాగు కోసమా? ఓటు బ్యాంకు కోసమా? అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు దొరకడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+