వైయస్ జగన్, చంద్రబాబు: అవిశ్వాసంపై గెలిచిందెవరు?

కాగా, తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగానే పరువును కాపాడుకోవాల్సిన అనివార్యతలో జగన్ పడ్డారు. తన వెంట ఉన్న శాసనసభ్యులు జారిపోకుండా చూసుకుని రాజకీయంగా తాను బలహీనపడలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. దాంతో గుంటూరు ఓదార్పు యాత్రను మధ్యలోనే ఆపేసి హైదరాబాదు వచ్చి, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. జగన్ వెంట ఆరుగురు శాసనసభ్యులు, లేదంటే పదికి మించి ఉండరబోరని ప్రచారం సాగుతున్న సమయంలో జగన్ తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. సిబిఐ విచారణను ఎదుర్కుంటున్న సమయంలో, తానే ఇరుకున పడిన సందర్భంలో శాసనసభ్యులు తన వెంట ఉంటారా అనే అనుమానాలకు ఆయన గురయ్యారో లేదో గానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం అలానే భావించారు.
వైయస్ జగన్ వెంట శాసనసభ్యులు పెద్దగా ఉండబోరని కాంగ్రెసుతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా భావించాయి. అయితే, కనీస బలాన్ని నిలుపుకోవడంలో ఆయన ఫలితం సాధించారనే చెప్పవచ్చు. జగన్ పూర్తిగా నిర్వీర్యం కాలేదని తేలిపోయింది. దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఏ రోజూ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి తన వర్గం శాసనసభ్యులను ప్రలోభపెట్టారని ఆరోపించారు. చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దాన్ని గమనించిన చంద్రబాబు జగన్‌పై మంగళవారం రాజకీయ విమర్శలు సంధించారు. మొత్తం మీద, జగన్‌ను పూర్తిగా చంద్రబాబు గానీ, కాంగ్రెసు పార్టీ గానీ దెబ్బ కొట్టలేకపోయారని అంటున్నారు.












Click it and Unblock the Notifications