విప్ ధిక్కరించిన శోభా నాగిరెడ్డిపై చర్యలు: చిరంజీవి

ప్రజలు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, అవినీతి ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఏం చేసినా తప్పు కాదన్నారు. సిఎం పాలనపై తమకు విశ్వాసం ఉందన్నారు. పిఆర్పీ ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభాలకు గురి చేశారని కానీ అవి సఫలం కాలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టాయని విమర్శించారు. పడగొట్టి కుర్చీ ఎక్కాలనుకున్న వారి కోరికను మేం నెరవేరకుండా చేశామన్నారు. నిన్నటి అవిశ్వాసం ఘటన విపక్షాలకు చెంపపెట్టు అన్నారు.












Click it and Unblock the Notifications