జగన్, కెసిఆర్ ప్యాకేజీ మాట్లాడుకున్నారు: ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా ఎన్నికల్లో పోటీ చేయకూడదని, అన్ని పార్టీలు జెండాలనూ ఎజెండాలను పక్కన పెట్టాలని తాము చెప్పినా వినడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు కాంగ్రెసు మోసం చేసింది, అవిశ్వాస తీర్మానం మంచి అవకాశమని తాము చెప్పామని, ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విఫలమైంది ఎవరో తెలిసిపోతూనే ఉన్నదని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులందరితో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయించామని, తమ పార్టీ క్రమశిక్షణ అలాంటిదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని తాము చెబుతూ వస్తున్నామని, అయినా కోదండరామ్ కాంగ్రెసు తెలంగాణ నాయకులను బలపరుస్తూ వస్తున్నారని ఆయన అన్నారు.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా, దీక్ష నాటకమని తాము ముందే చెప్పామని, డిసెంబర్ 1వ తేదీలోగా పార్టీ అధిష్టానం తెలంగాణ ఇస్తూ ప్రకటన చేయకపోతే పార్టీలో ఉండబోనని చెప్పారని, ఇప్పుడు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని, దీనికి కోదండరామ్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications