వైయస్ విజయమ్మపై దాడి బాధాకరం: కొండా సురేఖ

Konda Surekha
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం చెందినప్పుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని సంతకాలు సేకరించింది పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కాదా అని జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ మంగళవారం ప్రశ్నించారు. అప్పుడు సంతకాలు సేకరించిన వారే ఇప్పుడు దానిని జగన్‌పైకి నెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. అసెంబ్లీలో వైయస్ విజయమ్మపై అధికార, ప్రతిపక్షాలు దాడి చేయడం శోచనీయమన్నారు. బోత్స వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడుతన్నారు.

తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని కానీ వారు మాత్రం చివరి వరకు ఒక్కత్రాటిపై నిలబడ్డారన్నారు. అనర్హతకు తాము భయపడేది లేదని తెలిసే తాము విప్ ధిక్కరించి ఓటు వేశామన్నారు. తమ అనర్హతపై తాత్సారం చేస్తారని తాము భావించడం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెసు పార్టీ నేతలు దుష్ర్పచారం కూడా చేశారన్నారు.

తాము దేనికైనా సిద్ధపడి వేటు వేస్తారని తెలిసే అవిశ్వాసానికి మద్దతు తెలిపామని మరో ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఉప ఎన్నికలు వస్తే కడప ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. తాము రైతు సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చి మద్దతిచ్చామన్నారు. ప్రభుత్వం గ్రామాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+