జగన్ ఎమ్మెల్యేలదే నిబద్ధత, వీరికది లేదు: కెటిఆర్

తమ పార్టీని, తెలంగాణవాదాన్ని ఎదుర్కునే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒకే వైఖరిని అనుసరించారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశాన్ని దాటవేయడానికి ఇద్దరు కుమ్మక్కయి వ్యక్తిగత వాగ్వివాదానికి దిగారని ఆయన అన్నారు. తెలంగాణ అంశం ప్రస్తావనకు రాకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే చూసుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మరోసారి తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని బయటపెట్టారని, మరోసారి ఆంధ్రబాబు అని నిరూపించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి, కొండా సురేఖలపై పోటీ పెట్టాలా వద్దా అనే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. పోలవరం టెండర్ల విషయంలో తమ సవాల్‌ను చంద్రబాబు స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశం చర్చకు రాకుండా చూశారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవమానించినా కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు మద్దతు పలికారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications