పోలవరం రగడ: టిడిపి, టిఆర్ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్లు

పోలవరం టెండర్లలో అక్రమాలకు తమకు సంబంధం లేదని తమకు సంబంధం ఉందని నిరూపిస్తే తాము అసెంబ్లీలో ముక్కు నేలకు రాస్తామని సవాల్ విసిరారు. పోలవరంపై ఇప్పటి వరకు వైఖరి చెప్పలేదంటూ విరుచుకు పడ్డారు. ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ ధ్వజమెత్తారు. అయితే పోలవరం టెండర్లలో జరిగిన అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ సకల జనుల సమ్మెను టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోలవరం టెండర్ల కోసం నిర్వీర్యం చేశారని వారు ఆరోపించారు. టెండర్లలో అక్రమాలు నిరూపించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని టిఆర్ఎస్సే అందుకు చర్చకు రావడం లేదని విమర్శించారు.
అయితే ఈ సవాళ్లు ప్రతిసవాళ్లు వారు చేసుకుంటున్నప్పటికీ ఆ తర్వాత చర్చకు ఎవరూ రాకపోవడం విశేషం. పోలవరం టెండర్లలో అక్రమాలు అంటూ సమ్మె నిర్వీర్యం అయిన సమయంలోనే టిడిపి ఆరోపించింది. కొన్ని ఆధారాలు మీడియాకు విడుదల చేసింది. అప్పుడు టిఆర్ఎస్ కూడా రాజాంకు ఉన్న సంబంధంపై వివరణ ఇచ్చుకుంది. కానీ బహిరంగ చర్చ అంటూ అప్పుడు సవాళ్లు విసురుకొని ఊరుకున్నట్లుగానే ఇప్పుడూ అదే జరుగుతుందనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications