వైయస్ విజయమ్మ ఎంట్రీతో చంద్రబాబు స్పీచ్‌కు బ్రేక్

YS Vijayamma
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు వైయస్ విజయమ్మ శాసనసభలోకి సోమవారం తొలిసారిగా అడుగు పెట్టారు. ఈ సమయంలో శానససభ దృష్టి అంతా ఆమెపైనే పడింది. ఆమె లోనికి ప్రవేశిస్తున్నప్పుడు శానససభ్యులంతా ఆమె వైపే చూస్తూ ఉండిపోయారు. అదే సమయంలో అవిశ్వాస తీర్మానంపై చేస్తున్న ప్రసంగాన్ని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ఆపి ఆమె వైపు చూశారు. లోనికి ప్రవేశించి నింపాదిగా వెళ్లి తన సీట్లో కూర్చున్న విజయమ్మ వైపు అధికార, ప్రతిపక్ష సభ్యులు చూడడాన్ని పరస్పరం పసిగట్టుకున్నారు.

సభలోకి ప్రవేశించిన విజయలక్ష్మికి మంత్రులు గల్లా అరుణ కుమారి, సునీతా లక్ష్మారెడ్డి, వట్టి వసంత కుమార్, పొన్నాల లక్ష్మయ్య అభినందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి, తదితరు సభ్యులతో కలిసి ఆమె సభలోకి ప్రవేశించారు. వైయస్సార్‌కు జోహార్లు, అమర్ రహే వైయస్సార్ అంటూ వారు నినాదాలు చేశారు. ఆమెకు సీటు కేటాయింపులో కొంత అయోమయం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+