తెలుగు మీడియాకు వైయస్ జగన్ నో రిప్లయ్

జాతీయ మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై, సాక్షి పెట్టుబడులపై, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో సంబంధాలపై, తన ఆస్తులపై సిబిఐ విచారణ మీద, తన ఢిల్లీ పర్యటనపై, కాంగ్రెసు అధిష్టానంతో తాను కమ్మక్కయినట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సాక్షి మీడియాలో పెట్టుబడుల గురించి ప్రశ్నించే నైతికత ఎవరికీ లేదని ఆయన అన్నారు. సిబిఐ తనను వేధించినా అదో సమస్య కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే కుమ్మక్కయ్యారని ఆయన విమర్సించారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో తన పేరు లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications