ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం: జగన్ సవాల్

ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి రైతులపై, పేదలపై ప్రేమ లేదని, తన వర్గం శానససభ్యులను రెచ్చగొట్టడానికి రెండున్నరేళ్ల క్రితం మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. రైతు సమస్యలను, పేదల సమస్యలను ప్రస్తావించకుండా తన వర్గం శానససభ్యులను రెచ్చగొట్టి తన వైపు నిలబడకుండా చేయాలని కుట్ర చేశారని ఆయన అన్నారు. తన వర్గం శానససభ్యులను అధికార పక్షం నేతలు బెదిరించారని, ప్రలోభ పెట్టారని ఆయన విమర్శించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని బాబూరావును బెదిరించారని ఆయన చెప్పారు. సుచరితను కూడా బెదిరించాని ఆయన చెప్పారు. తన వర్గం శాసనసభ్యులు విలువలకు, నిజాయితీకి కట్టుబడి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారని ఆయన అన్నారు.
కాంగ్రెసు, తెలుదేశం పార్టీలకు పేదలు, రైతులు పట్టరని, ఈ విషయంలో రెండు పార్టీలు దొందూ దొందేనని ఆయన అన్నారు. సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానం దేశచరిత్రలో ఓ చారిత్రక ఘట్టమని ఆయన అన్నారు. అధికార పక్షంలో ఉండి, పదవులు పోతాయని తెలిసీ, అధికార పక్షంతో పోరాడాల్సి వస్తుందని తెలిసీ రైతులకు, ప్రజలకు మద్దతుగా తన వర్గం శాసనసభ్యులు నిలిచారని ఆయన అన్నారు. ఎంత మంది నిలబడ్డారనేది ముఖ్యం కాదని, రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారని, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని, కొత్త రాజకీయాలకు నాంది పలికారని ఆయన అన్నారు. తనకు తోడుగా నిలబడిన శాసనసభ్యులను చూసి తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. సిబిఐ విచారణకు తాను సిద్ధపడి ఉన్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications