వైయస్ జగన్ ఎమ్మెల్యేలు: కెవిపి మంతనాలు విఫలం

కెవిపి రామచందర్ రావు జగన్ వర్గానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులతో చర్చలు జరిపారు. ధర్మాన కృష్ణదాసు, కాపు రామచంద్రా రెడ్డి, ప్రసాద రాజు, బాల రాజు, గుర్నాథ్ రెడ్డితో చర్చలు జరిపారు. సమస్యలను పరిష్కరిస్తానని, కాంగ్రెసు పార్టీ అధిష్టానం తగిన విధంగా గుర్తించేలా చేస్తానని కెవిపి వారికి చెప్పారు. వారు ఆయన మాట విన్నట్లు లేరు. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజానాథ్, శాసనసభ్యుడు వీరశివా రెడ్డి పూతలపట్టు రవి, శ్రీకాంత్ రెడ్డి, బి. శ్రీనివాసులులతో మాట్లాడారు. పూతలపట్టు రవి మాత్రమే ఓటింగులో పాల్గొనలేదు. పూతలపట్టు రవితో చిత్తూరు జిల్లా శాసనసభ్యుడు సికె బాబు గంటల తరబడి మాట్లాడారు.
మంత్రి వట్టి వసంతకుమార్ బాలరాజుతో సమావేశమయ్యారు. కెవిపితో సమావేశం ఏర్పాటు చేశారు అయితే కెవిపికి బాలరాజు ఏ విధమైన హామీ ఇవ్వలేదు. అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పార్టీలోకి వస్తే తగిన ప్రతిఫలం దక్కేలా చూస్తామని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. తాము ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ వర్గం శాసనసభ్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications