బాబు మీద బొత్స వ్యాఖ్యలపై దుమారం, టిడిపి నిరసన

వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో బొత్స సత్యనారాయణ కోట్లు వెనకేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై బొత్స సత్యనారాయణ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ చంద్రబాబును ముద్దాయిగా అభివర్ణించారు. సిబిఐ విచారణకు చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు. హైకోర్టు ఆదేశాలపై కోర్టుకు వెళ్లనని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని, హైకోర్టులో వెకేట్ పిటిషన్ వేశారని ఆయన అన్నారు. విచారణను ఆపించుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆయన అన్నారు. తామపై విచారణకు ఆదేశిస్తే తాము కోర్టుకు వెళ్లబోమని ఆయన అన్నారు.
చంద్రబాబు కోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని ఆయన అడిగారు. ఈ స్థితిలో తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఓటింగు జరగాల్సి ఉండగా సభలో గందరగోళం చెలరేగింది. సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ టిడిపి సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తిరిగి మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత సభ సద్దుమణిగింది. ప్రభుత్వంపై ఆయన తిరిగి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదంతా సోమవారం అర్థరాత్రి జరిగిన తర్వాత శాసనసభలో నడిచింది.












Click it and Unblock the Notifications