కడుపు కొట్టి భవంతి కట్టాడు: జగన్‌పై ఎర్రన్నాయుడు

Yerram Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కడుపు కొట్టి లోటస్ పాండులోని భవంతి, బెంగళూరులోని భవంతులు కట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు బుధవారం ధ్వజమెత్తారు. కాంగ్రెసు గుర్తుతో గెలిచిన ప్రజాప్రతినిధులను తన ఎమ్మెల్యేలుగా జగన్ ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం నడుపుతున్న మైనార్టీ ప్రభుత్వమేనన్నారు. బయట నుండి ఎంఐఎం, ప్రజారాజ్యం మద్దతిస్తున్నారని కానీ వారు కాంగ్రెసులో భాగం కానే కాదన్నారు.

రైతుల సమస్యలపై తాము అవిశ్వాసం పెడితే ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదనడం రైతులను అపహాస్యం చేయడమేనని అవి ద్రోహపూరిత వ్యాఖ్యలన్నారు. రోజుకు డజను మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రాష్ట్రవ్యాప్తంగా పంట విరామం ప్రకటిస్తుంటే అది అసాధారణ విషయం కాదా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో మందులు లేవవి, వైద్యులు లేరని ఆరోపించారు. ఆత్మహత్యలు రైతులు మంత్రులకు పట్టడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+