ఈడి నోటీసుకు చంద్రబాబు తనయుడు లోకేష్ వివరణ

Nara Lokesh
హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జారీ చేసిన నోటీసుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు కూడా ఈడికి వివరణ ఇచ్చారు. విదేశీ మారకద్రవ్యం నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై ఈడి లోకేష్‌కు, ఎన్టీఆర్ ట్రస్టుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ట్రస్టు విరాళాలు సేకరించి ఇండియన్ హెరిటేజ్ ట్రస్టుకు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి అలాగే నారా లోకేష్ విదేశాల్లో చదవడానికి సత్యం రామలింగరాజు డబ్బులు సమకూర్చారనే ఆరోపణలు వచ్చాయి. నారా లోకేష్ కొనుగోలు చేసిన భూమిపై కూడా ఈడి దృష్టి సారించింది.

చంద్రబాబు కుటుంబానికి సింగపూర్‌లో హోటల్ ఉందనే ఆరోపణలపై కూడా ఈడి విచారణ జరుపుతోంది. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి, రిత్విక్ ప్రాజెక్ట్స్ యజమాని, తెలుగుదేశం నాయకుడు సిఎం రమేష్ కూడా ఈడి నోటీసులకు వివరణ ఇచ్చారు. సంబంధిత పత్రాలను సమర్పించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు చంద్రబాబు, తదితరుల ఆస్తులపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈడి నవంబర్ 22వ తేదీన పలువురికి నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+