బోరు బావి నుంచి ప్రాణాలతో బయటపడిన బాలుడు

Tirumalesh
మహబూబ్‌నగర్: బోరు బావిలో పడిన బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరు గంటల పాటు అధికారులు అవిశ్రాంతంగా పనిచేసి, బాలుడిని రక్షించారు. బోరుబావికి సమాంతరంగా తవ్వి అతన్ని బయటకు తీశారు. రాత్రి పదిన్నర గంటలకు అతన్ని వెలికి తీసి ఏరియా ఆస్పత్రికి తరలించారు తిరుమలేషే అనే రెండేళ్ల బాలుడు బుధవారం సాయంత్రం ఓ బారు బావిలో పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలో బుధవారం సంభవించింది. ఆ బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అతడిని ప్రాణాలతో బయటకు తీయడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నించి ఫలితం సాధించారు. బోరు బావి పక్కల నుంచి తవ్వుతూ అతన్ని బయటకు తీయడానికి ఏర్పాట్లు చేశారు. బాలుడు 20 అడుగుల లోతులో పడిన విషయాన్ని గుర్తించి చర్యలు చేపట్టారు.

తిరుమలేష్ అనే రెండేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు. తల్లిదండ్రులు పనులు చేసుకుంటుండగా ఆ బాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. నీళ్లు పడకపోవడంతో ఆ బోరు బావిని అలా వదిలేశారు. దాన్ని పూడ్చివేయకపోవడమే కాకుండా పైన కూడా ఏమీ కప్పలేదు. దీంతో ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులు ఈరన్న సుజాత ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+