అవిశ్వాసం తర్వాత కాంగ్రెసు బలహీనపడింది: కిషన్‌ రెడ్డి

Kishan Reddy
మహబూబ్ నగర్: అవిశ్వాస తీర్మానం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ మరింత బలహీనపడిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి గురువారం అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెసు బలం ఎంతో తెలిసిపోయిందని అన్నారు. ప్రభుత్వం చిరంజీవి, ఎంఐఎం పార్టీలతో గట్టెక్కాయన్నారు. మజ్లిస్ పార్టీ వల్ల హైదరాబాదులో గూండాయిజం పెరిగిందని ఆరోపించారు.

అవిశ్వాస తీర్మానం తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం, సెక్యులరిజం ఓడినట్లుగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై పార్టీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో మూడంచెల విధానాన్ని సమర్థిస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+