చిదంబరానికి వ్యతిరేకంగా సాక్షిగా స్వామికి అనుమతి

తీహార్ జైలులో ఉన్న టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కలిసి చిదంబరం స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించారని స్వామి ఆరోపించారు. స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించడానికి రాజా, చిదంబరం మధ్య నాలుగు సమావేశాలు జరిగాయని ఆయన చెప్పారు. రాజాతో అప్పటి ఆర్థిక మంత్రి మాట్లాడారని ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను కూడా ఆయన ప్రస్తావించారు. స్పెక్ట్రమ్ ధరలపై రాజా, చిదంబరం కలిసే ఫార్ములాను రూపొందించారని ఆయన అన్నారు. విదేశీ కంపెనీలకు లైసెన్సుల విక్రయానికి అప్పటి ఆర్థిక మంత్రి అనుమతి ఇచ్చారని రాజా ఫైలులో, పత్రికా ప్రకటనలో నోట్ చేశారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications