ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులపై లోకాయుక్త కేసు

కాగా వీరిపై కేసు నమోదు చేయడం ద్వారా ఇప్పటి వరకు కర్నాటకలో అక్రమ మైనింగ్ కేసులో బిజెపి, జెడి(ఎస్)తో పాటు కాంగ్రెసు కలిసినట్లయింది. ప్రముఖ సామాజిక సంస్కర్త అబ్రహం టి జోసెఫ్ వీరిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం ఎస్ఎం కృష్ణ పాలన సమయంలో(1999-2004) గనుల కేటాయింపులు జరపడమే కాకుండా, పాత ధరల ప్రకారమే సంస్థలకు కట్టబెట్టారు. అంతేకాకుండా ఫారెస్టు లాండ్‌ను కట్టబెట్టారు. ధరం సింగ్ 2005-06 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఐరన్ ఓర్ తాత్కాలిక ట్రాన్సుపోర్టుకు అనుమతులిచ్చారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications