తెలంగాణకు, క్యాబినెట్ విస్తరణకు లింక్ పెట్టిన ఆజాద్

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణకు, తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ లింక్ పెట్టారు. తెలంగాణ సమస్యను పరిష్కరించిన తర్వాతనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం అంత సులభం కాదని, తెలంగాణ సమస్య సంక్లిష్టమైందని ఆయన అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని, ఏకాభిప్రాయ సాధనకు కూడా ప్రయత్నిస్తున్నామని, పెద్ద యెత్తున కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. త్వరలో తెలంగాణపై సముచిత నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో మాట్లాడిన తర్వాతనే విప్‌ను ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వారిపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. వైయస్ జగన్ వైపు 16 మంది శాసనసభ్యులు వెళ్లడం ఆశ్చర్యకమైన విషయమని ఆయన అన్నారు. రేపు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి వస్తారని, వారితో తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తామని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనా తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి బలాన్ని నిరూపించుకుందని, ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు.

చిరంజీవి కాంగ్రెసు పార్టీలో భాగమని, చిరంజీవి కాంగ్రెసు నాయకుడని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నారనే విషయంలో నిజం లేదని ఆయన అన్నారు. చిరంజీవికి తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన శాసనసభ్యులకు, నాయకులకు తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆజాద్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+