ఈనాడులో రామోజీ రావు అబద్దాలు చెప్పారన్న సాక్షి

పాలమాకులలో రామోజీ బినామీ పేర్లతో భూములు కూడబెట్టుకున్నారని, ప్రభుత్వం, పేదల భూములు కలుపుకున్నారని ఆరోపించింది. అక్రమాలు అధికారుల పరిశీలనలో బట్టబయలు అవుతాయేమోనని గుట్టు చప్పుడు కాకుండా ఫెన్సింగ్ తొలగించారని ఆరోపించింది. 431 ఏకరాలను సర్వే చేస్తే భారీ ఎత్తున అసైన్డ్ స్థలాల గుట్టు తేలటం ఖాయమని స్థానికులు చెబుతున్నారని పేర్కొంది. హైటెక్ సిటీ భూబాగోతం తర్వాత వట్టినాగులపల్లిపై బాబు బినామీల కన్ను పడిందంటూ బాబు పొట్టలో వట్టినాగులు పేరుతో మరో కథనం రాసింది. గ్రామ రైతుల నుండి కారుచౌకగా భూములు కొనుగోలు చేసి ఆ తర్వాత ఆయన సన్నిహితులు భారీగా లాభపడ్డారని చెప్పింది.












Click it and Unblock the Notifications