రాజగోపాల్ పోస్టుమెనే:బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా

రాజగోపాల్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాక్ష్యులను తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని బెదిరించే అవకాశం ఉందన్నారు. ఆయనపై అభియోగాలు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఓఎంసిలో ఆయనదే కీలక పాత్ర అని చెప్పారు. ఓఎంసి కేసులో ఛార్జీషీటును ఈ నెల 28న సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని సిబిఐ తెలిపింది. కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరతామని, నిందితుల బినామీ లావాదేవీలపై ఇంకా దర్యాఫ్తు కొనసాగాల్సి ఉందని తెలిపింది.
గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్‌లపై అభియోగాలు రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సాక్ష్యం చెప్పొద్దని ఓ వ్యక్తిని రాజగోపాల్ బెదిరించారని తెలిపారు. ఓఎంసి అక్రమాలు రాజగోపాల్‌కు మొదటి నుండి తెలుసన్నారు. శ్రీలక్ష్మి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టును ఆశ్రయిస్తామని సిబిఐ తెలిపింది. శ్రీలక్ష్మికి బెయిల్ ఇచ్చినట్లే తనకూ ఇవ్వాలన్న రాజగోపాల్ వాదన సరికాదన్నారు. శ్రీలక్ష్మికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పింది.












Click it and Unblock the Notifications