సిబిఐ కౌంటర్‌తో బయటకురాని రాజగోపాల్, శ్రీలక్ష్మి పైనా

ఆ తర్వాత సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభించారు. రాజగోపాల్ బయటకు వెళితే ప్రాణహాని ఉందని, రాజగోపాల్‌కు సంబంధించిన తాజా సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. కేసు కీలక దశలో ఉందని ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్నారు. రాజగోపాల్‌ను మరో వారం రోజులు ఉండనివ్వాలని, చాలా సమాచారం తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ఇరువురి వాదనలు విన్న కోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించి బెయిల్ పై తాత్కాలిక స్టే విధించింది. 19వ తేది వరకు బెయిల్ నిలుపుదల చేసింది. దీంతో ఉదయం బెయిల్ వచ్చినప్పటికీ రాజగోపాల్ బయటకు రాలేక పోయారు. కాగా రాజగోపాల్ బెయిల్ పైన పిటిషన్ వేసినట్లే శ్రీలక్ష్మి బెయిల్ పైన కూడా పిటిషన్ వేయాలని సిబిఐ భావిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications