బస్సునుండి జారి విద్యార్థి మృతి, ప్రమాదాల్లో నలుగురు

Hyderabad
హైదరాబాద్/మహబూబ్ నగర్: నగరంలోని కూకట్‌పల్లిలో గురువారం బస్సు నుండి దిగుతూ ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. ఇతను గుంటురు జిల్లా ఈపూరు వాసి. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో ఆమనగల్లు మండలం విట్టాయపల్లి సమీపంలో హైదరాబాద్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ వస్తుండగా ప్రమాదవశాత్తూ కారు కల్వర్టును ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద లారీ - వోల్వో బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. బస్సు విశాఖపట్నం నుండి ఒంగోలు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో పదిహేను మంది ప్రయాణీకులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నాలుగేళ్ల కూతురు సహా తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+