కేసులు ఎత్తేస్తే పార్టీ రద్దుకు జగన్ రెడీ: చంద్రబాబు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగాలు ఊడబెరుతున్నారని, పైగా లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కేంద్రంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడే బీడీకట్టలపై పుర్రె గుర్తు వేసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కార్మికులకు సమస్యలు చాలానే ఉన్నాయని, పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం తెస్తానని ఓ హీరో వచ్చాడని, రెండేళ్లు కాకుండా కాంగ్రెసు కంపులో కలిసిపోయాడని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వాలు పనిచేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో వారికే తెలియదని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలన వస్తే కరెంట్ తీగలు బట్టులు ఆరేసుకోవడానికి కూడా పనికి రావని, ఇప్పుడు అదే జరుగుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం సవ్యంగా పనిచేయడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీని నాయకులే మోసం చేశారని, పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మోసం చేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications