లిక్కర్ స్కామ్: బొత్సను టార్గెట్ చేసిన కిరణ్ రెడ్డి?

బొత్స సత్యనారాయణ ఐదు జిల్లాల్లో హవా కొనసాగిస్తున్నారని, లిక్కర్ సిండికేట్లను దెబ్బ తీయడం ద్వారా బొత్స సత్యనారాయణను రాజకీయంగా బలహీన పరచవచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి భావించినందువల్లనే ఎసిబి దాడులు జరిగాయని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్ వ్యాఖ్యానించింది. కోట్ల రూపాయలలో శాసనసభ్యులకు ముడుపులు ముడుతున్నాయని కూడా ఆరోపించింది. రిపోర్టర్లకు కూడా ఇందులో వాటా ఉన్నట్లు తెలిపింది. గుంటూరు జిల్లా మద్యం సిండికేట్‌లో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాత్ర ఉందని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద రావు ఆరోపించారు. పార్టీలకు అతీతంగా శానససభ్యులు కుమ్మక్కయి మద్యం సిండికేట్లను నడిపిస్తున్నట్లు కూడా ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్ ఆరోపించింది.












Click it and Unblock the Notifications