లిక్కర్ స్కామ్‌లో మంత్రుల హస్తం: మోత్కుపల్లి

Mothukupally Narasimhulu
హైదరాబాద్: లిక్కర్ కుంభకోణంలో రాష్ట్ర మంత్రుల పాత్ర ఉందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. లిక్కర్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్లపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్న అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) స్వాధీనం చేసుకున్న పత్రాలను బయటపెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంలోని మంత్రుల పేర్లను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు సారా వ్యాపారుల్లా మారారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. కుంభకోణం నుంచి మంత్రులు, కాంగ్రెసు నాయకుల పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్‌లో పాత్ర ఉన్న మంత్రులను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మద్యం కుంభకోణంలో రెండు కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆయన అన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వం ఎవరి ప్రాణాలు తీస్తుందో ఆలోచించాలని ఆయన అన్నారు. మద్యం కుంభకోణంలో మంత్రుల పాత్రకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం నాయకుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. పోలవరం టెండర్ల విషయంలో తాము చేసిన ఆరోపణలు నిజమని తేలిందని తెలుగుదేశం మరో నేత మండవ వెంకటేశ్వర రావు అన్నారు. పోలవరం టెండర్లపై తాము సాగిస్తున్న పోరాటం ఆగదని ఆయన అన్నారు. అక్రమాలు చోటు చేసుకున్న ఫైళ్లను అన్నింటినీ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+