జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలకు 19న స్పీకర్ నోటీసులు

YS Jagan
హైదరాబాద్: పార్టీ విప్‌ను ధిక్కరించి, అవిశ్వాస తీ ర్మానానికి అనుకూలంగా ఓటువేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ వర్గానికి చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు 16 మందికి ఈ నెల 19వ తేదీ సోమవారమే నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం వీటిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి. వీటిపై సోమవారం ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నాయి. మంగళవారం తన ముందు హాజరు కావాలని ఆయన జగన్ వర్గం శాససభ్యులను ఆదేశించే అవకాశాలున్నాయి.

కాగా.. ఆ రోజే ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి నుంచి స్పీకర్ వివరణ తీసుకోనున్నారు. ఆమె శాసనసభా సభ్యత్వంపై స్పీకర్ అదే రోజు నిర్ణయం తీసుకునే వీలుందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఆయన లోకసభ స్పీకర్ మీరా కుమార్‌ను, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కలుసుకున్నారు. న్యాయనిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+