ఉప ఎన్నికలకు మేం రెడీగా ఉన్నాం: అంబటి రాంబాబు

ఈ నెల 23వ తేదీన రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సదస్సులు జరుగుతాయని, జగన్ ఎక్కడ ధర్నాలో పాల్గొంటారనేది తెలియదని ఆయన అన్నారు. 108, 104 సర్వీసుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో వైయస్ జగన్‌కు ఉన్న ఆదరణను చూసే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications