తెలంగాణ కుంపటి పెట్టింది వైయస్సే: లోక్‌సత్తా నేత జెపి

Jayaprakash Narayana
ఖమ్మం: తెలంగాణ సమస్యను తెర మీదికి తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డేనని లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. 1999 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలంగాణ ముసలాన్ని వైయస్ ప్రవేశపెట్టారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమకు తెలంగాణ కావాలని చెప్పాలంటూ వైయస్ తెలంగాణ శాసనసభ్యులను ప్రేరేపించారని ఆయన విమర్శించారు. అధికార పాచికలో తెలంగాణ అంశాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారని, దీనివల్ల తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఓట్ల కోసం తెలంగాణ నాయకులను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో ఓట్ల కోసమే తెలుగుదేశం పార్టీ తెలంగాణవాదాన్ని చేపట్టిందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ ప్రజల సమస్యలు కూడా పరిష్కారం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. హింస ద్వారా ముందుకు పోతే నష్టపోయేది తెలంగాణ ప్రజలేనని ఆయన అన్నారు. 14ఎఫ్ తొలగింపునకు, 610 జీవో అమలుకు పోరాటం చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని ఆయన చెప్పుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన అఖిల పక్ష కమిటీలో తమకు ఏ విధమైన స్థానం లేదని, అయినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. పోలవరం టెండర్లను త్వరితగతిన పూర్తి చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+