దమ్ము చూపిస్తాం: సన్నాసి అంటూ కెసిఆర్‌పై టిడిపి ఫైర్

తెలంగాణవాదాన్ని వాడుకొని కెసిఆర్, కోదండరామ్ లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రజలను పీడించిన నిజాం వారసుడు కెసిఆర్ అన్నారు. ఎన్నికలు, కలెక్షన్లే ఆయన అజెండా అని, పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఫామ్ హౌస్‌లో నిద్ర పోతున్నారని విమర్శించారు. తెలంగాణ ఆయన అయ్య జాగీరు కాదని, సెంటిమెంట్ అఢ్డు పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం టెండర్ల అంశం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. టెండర్ల ఫైళ్లు స్పీకర్ ముందుకు వెళ్లాల్సిందేనని, ఎవరి ప్రమేయం ఉందో తేల్చాల్సిందేనన్నారు. కెసిఆర్‌కు గుణపాఠం చెబితే కానీ దారిలోకి రారని, రైతులు అల్లాడుతుంటే ఎక్కడ పడుకున్నారని ధ్వజమెత్తారు. అందర్నీ సన్నాసి అనే కెసిఆరే అసలు సన్నాసి అన్నారు.
ఉప ఎన్నికల్లో టిడిపి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ తప్పుకుంటే మేం పోటీ నుండి తప్పుకుంటామన్నారు. ఉప ఎన్నికల్లో మా దమ్ము చూపిస్తామన్నారు. తెలంగాణపై మేథావులతో సదస్సు జరగాలని వారు అభిప్రాయపడ్డారు. కెసిఆర్‌కు జనాన్ని చంపుకు తినే అలావాటు ఉందన్నారు.












Click it and Unblock the Notifications