పార్లమెంటులో వైయస్ జగన్‌కు పలకరింపులు కరవు

YS Jagan
న్యూఢిల్లీ: పార్లమెంటుకు హాజరైన వైయస్సార్ కాంగ్రెసు లోకసభ సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పలకరింపులు కూడా కరవయ్యాయి. సోమవారం పార్లమెంటుకు వచ్చిన జగన్‌కు దగ్గరకు రావడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. అంటీ ముట్టనట్లుగా, కనీసం పలకరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో చాలాసేపు మాట్లాడుతూ కాలం గడిపారు. తన వర్గం ఎంపీ సబ్బం హరితో కొద్దిసేపు ఉన్నారు. ఆ తర్వాత సబ్బంను ఇంటికి పంపి, జగన్ సభలో ఉన్నారు.

జగన్‌ను చేరదీసినా, ఆయన తరఫున మధ్యవర్తిత్వం వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ పెద్దలు హెచ్చరించడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. కాగా, సోనియా, రాహుల్ గాంధీలాంటి నేతలతో మాట్లాడే ధైర్యం లేని జగన్ వర్గీయులు - ఒక గవర్నర్ ద్వారా, కేంద్రంలో ఒకరిద్దరు మంత్రుల ద్వారా మధ్యవర్తిత్వ యత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే, ముందు పార్టీని రద్దు చేసుకోవాలని చెప్పండని వారు మధ్యవర్తులకు చెప్పారని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది. దాంతో మధ్యవర్తులు నోరు మూసుకున్నారని చెబుతున్నారు.

ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్న 'జగన్ సన్నిహితుల'పట్ల రాజకీయ, అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానానికి, కేంద్రానికి నివేదికలు అందుతున్నట్లు తెలుస్తోందని ఆ పత్రిక రాసింది. ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోనేరు ప్రసాద్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ చంచల్‌గూడ జైలులో ఉన్నప్పటికీ బయటి ప్రపంచంతో వారికి అనుక్షణం సంబంధాలు కొనసాగేందుకు ఉన్నత స్థాయి అధికారులు సహకరిస్తున్నారని కేంద్ర హోంశాఖకు ఒక నివేదిక అందినట్లు తెలిసిందని ఆ వార్తాపత్రిక కథనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+