సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Samala Sadasiva
న్యూఢిల్లీ: ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కేంద్రసాహిత్య అకాడమీ 2011 సంవత్సరానికిగాను పురస్కారాలను ప్రకటించింది. 22 భాషలకు చెందిన 22 మంది సాహితీవేత్తలను వివిధ విభాగాల్లో ఈ అవార్డుకు ఎంపిక చేసింది. తెలుగులో సామల సదాశివకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఆయన రచించిన 'స్వరలయలు' పుస్తకం అవార్డుకు ఎంపికైంది. సంస్కృతానికి సంబంధించి తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ ప్రొఫెసర్ హరేకృష్ణ శతపథికి కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. సంస్కృత భాషలో ఆయన రచించిన 'భారతాయనం' అన్న గ్రంథానికిగాను కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. సుప్రసిద్ధ చరిత్రకారుడు రామచంద్ర గుహకు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తింపు దక్కింది. ఆయన రాసిన 'ఇండియా ఆఫ్టర్ గాంధీ' వ్యాసం చారిత్రక కథన విభాగంలో అవార్డుకు నోచుకుంది.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలం తెనుగు పల్లెలో 1928, మే 11న సామల సదాశివ జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర, మిర్జాగాలిబ్ జీవిత చరిత్ర, మరాఠీ కవి కేశివసుత్ జీవిత చరిత్ర, అమ్జత్ రుబాయాలు వంటి ఎన్నో పుస్తకాలు రచించారు. గిరిజన యోధుడు కొమురం భీంను పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠంగా చేర్చిన ఘనత ఆయనదే. తెలుగు, ఉర్దూ భాషల్లో వందలకొద్దీ సాహిత్య వ్యాసాలు రాశారు. హిందూస్తానీ సంగీతంపై రచించిన గ్రంథం స్వరలయలు 'అంజన్ రుబాయిలు' రచనకుగాను 1964లో రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, 1969లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనను వరించాయి. ఆయన రచించిన మలయమారుతాలు, సంగీత శిఖరాలు వంటి వ్యాససంకలనాలు ఎంతగానో ప్రసిద్ధి పొందాయి. ఉర్దూ, పార్శీ, సంస్కృతం, మరాఠి, హిందీ, ఇంగ్లీష్ భాషల్ని పుక్కిట పట్టిన బహుభాషా కోవిదుడాయన. 'యాది' పేరిట ఆయన రాసిన వ్యాసాలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి.

ఇతర పురస్కార గ్రహీతలు..

దివంగత కాబిన్ ఫుకాన్ (అస్సామీ), మణీంద్ర గుప్తా (బెంగాలీ), మోహన్ పర్మార్ (గుజరాతీ), కాశీనాథ్ సింగ్ (హిందీ), గోపాలకృష్ణ పాయ్ (కన్నడ), నసీమ్ షఫాయీ (కాశ్మీరీ), మెల్విన్ రోడ్రిగ్స్ (కొంకణి), ఎం.కె.సాను (మలయాళం), క్షేత్రి బిరా (మణిపురి), గ్రేస్ మాణిక్ గోడ్ఘాటే (మరాఠీ), కల్పనా కుమారి దేవి (ఒరియా), బాల్‌దేవ్ సింగ్ (పంజాబీ), అతుల్ కనక్ (రాజస్థానీ), ఆదిత్యకుమార్ మండి (సంతాలీ), మోహన్ గెహానీ (సింధీ), ఎస్. వెంకటేశన్ (తమిళం), ఖలీల్ మామూన్ (ఉర్దూ), లలిత్ మగోత్రా (డోగ్రీ), ప్రేమానంద మొసాహరి (బోడో). నేపాలీ భాషలో పురస్కారాన్ని ప్రకటించలేదు. 2012, ఫిబ్రవరి 14న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాతో అకాడమీ వీరందరినీ సత్కరించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+