హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాడి వెనుక హోంమంత్రి కొడుకన్న మంద కృష్ణ, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావుపై దాడిలో హోంమంత్రి తనయుడి హస్తం ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. శంకరరావుపై దాడి జరిగి మూడు రోజులు దాటినా పోలీసులు కారకులను అరెస్టు చేయలేదని విమర్శించారు. హోంమంత్రి తనయుడి హస్తం ఉంది కాబట్టే అరెస్టు చేయలేదని ఆరోపించారు. దాడికి నిరసనగా ఈ నెల 26న ర్యాలీలు, ఆందోళనలు, 27న శంకరరావు ఇంటి నుండి దాడి జరిగిన ప్రాంతం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

శంకరరావుపై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ నుండి మంద కృష్ణ మాదిగ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు బషీర్ బాగ్ వద్దే అడ్డగించారు. మంద కృష్ణతో పాటు పలువురు మాదిగ హక్కుల పోరాట నేతలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ తరలించారు. మందకృష్ణను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసి పిఎస్ తరలిస్తుండగా కార్యకర్తలు వాహనానికి అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా తప్పించారు.

English summary
MRPS president Manda Krishna Madiga accused Home Minister's son for attack on minister Shankar Rao. He demanded government to arrest minister son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X