హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిక్కర్ డాన్‌‍ను కాదు: సిఎంను వెనుకేసుకొచ్చిన బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తాను లిక్కర్ డాన్‌ను కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. మద్యం సిండికేట్లలో నా ప్రమేయంపై టిడిపి కోర్టుకెళ్లినా నేను టిడిపి అధినేత చంద్రబాబు వలె స్టే తెచ్చుకోనని చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు మద్యం దుకాణాలు ఉన్న మాట వాస్తవమేనని, తనకు విజయనగరం జిల్లాలో తప్ప ఇంకెక్కడా వైన్ షాపులు లేవన్నారు. ఉన్నాయని టిడిపి నిరూపిస్తే అవి వారికే రాసిచ్చి తలవంచుకుంటానన్నారు. వ్యాపారం వేరు అవినీతి వేరు అన్నారు. చంద్రబాబు తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి నిర్మూలనకే కృషి చేస్తున్నారన్నారు. మద్యంపై విధానాన్ని మార్చింది బాబే అన్నారు. సిఎం ప్రోద్బలంతోనే మద్యం సిండికేట్లపై దాడులు జరిగాయనడం అర్థరహితమన్నారు. సిఎంకు చెక్ చెప్పేందుకే సమన్వయ కమిటీ అన్న వార్తల్లో కూడా వాస్తవం లేదన్నారు. కమిటీ విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, విధివిధానాలు కాంగ్రెసుకు కొత్త కాదన్నారు. అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. కమిటీ ఏర్పాటుతో తెలంగాణ వారికి అన్యాయం అనడం సరికాదన్నారు. ఎవరి ప్రాంతాల మనోభావాలు వారికి ఉంటాయని అది తప్పు కాదన్నారు. పార్టీ బలోపేతానికే సమన్వయ కమిటీ అన్నారు.

త్వరలో ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. 26న మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశం ఉంటుందన్నారు. ఉప ఎన్నికలపై జగన్ వర్గం ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలే అన్నారు. ఎమ్మెల్యేలపై వేటు స్పీకర్ పరిధిలో ఉంటుందని చెప్పారు.

English summary
I am not liquor don, said PCC chief Botsa Satyanarayana today. He condemned TDP comments on him and his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X