వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజారాజ్యం పునరుద్ధరణ ఉండదు: కోటగిరి విద్యాధర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kotagiri
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించే అవకాశం లేదని గత ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావు స్పష్టం చేశారు. పదవుల కోసం తాము ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయలేదని, అందువల్ల పార్టీని పునరుద్ధరించే అవకశాం ఉండదని ఆయన అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అనంతరం ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చిరంజీవి సేవలను కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ సమన్వయ కమిటీ వేయడం మంచి పరిణామమని, ఇందులో చిరంజీవికి స్థానం కల్పించడం శుభసూచకమని ఆయన అన్నారు.

సమన్వయ కమిటీలో చిరంజీవికి స్థానం కల్పించడం వల్ల అభిమానుల్లో మనోధైర్యం పెరిగిందని, అది కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మూడు ప్రాంతాలను సమతులనం చేస్తూ సమన్వయ కమిటీని వేశారని, ఇది పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. తీవ్రమైన అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి పునరుద్ధరించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. నెల్లూరు జిల్లా ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుడు శ్రీధర కృష్ణా రెడ్డి ప్రకటన ఆ వార్తలకు బలం చేకూర్చింది.

English summary
Congress senior leader Kotagiri vidyadhara Rao said that Prajarajyam party will not be revived.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X