చిరంజీవితో పిసిసి చీఫ్ బొత్స, కావూరితో సిఎం కిరణ్

అదే స్కూల్లో చదువుకున్న కావూరి కుమారుడు భాస్కర రావు తన పూర్వ విద్యార్థులతో కలసి నిర్వహించిన ఈ గెట్ టు గెదర్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన సిఎం కిరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు సన్మానించారు. అనంతరం కావూరి, సిఎం కిరణ్, బాపిరాజు తదితర నేతలు కొద్దిసేపు రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నారని సమాచారం.
వీరు ఇక్కడ సమావేశమైన సమయంలోనే చిరంజీవితో పిసిసి చీఫ్ బొత్స భేటీ అయ్యారు. చిరు, బొత్సల భేటీలోనూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేబినేట్‌లో ప్రజారాజ్యం ఎమ్మెల్యేల చేరిక, రాష్ట్ర రాజకీయాలపై అధిష్ఠానం ఆలోచన తదితర అంశాలన్నీ చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఇరు వర్గాలూ తమ తమ భేటీలను రాజకీయ ప్రాధాన్యం లేనివి గానే కొట్టిపారేస్తున్నాయి. అయితే ఈ రెండు సమావేశల్లోనూ రాజకీయాల పైనే ప్రధానంగా చర్చ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications