కాంగ్రెసును చంకనేసుకుంటున్నారు: కోదండరామ్‌పై గౌడ్

కరెంట్ చార్జీలు పెంచితే సహించేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది ప్రజా ప్రభుత్వం కాదని, అది పన్నుల ప్రభుత్వమని ఆయన అన్నారు. ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు ప్రార్టీ ఇప్పుడు ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం చేతకాని తనం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. సామాన్య మానవుడిపై ప్రభుత్వం పిడుగులు కురిపిస్తోందని, కరెంట్ చార్జీలు పెంపు ప్రతిపాదన అటువంటిదేనని ఆయన అన్నారు. కరెంట్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications