స్పీకర్‌కు ఏం చెబుదాం!?: జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ

విప్ ధిక్కరించినట్లు స్పష్టంగా తెలుస్తున్నందున నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, అవసరమనుకుంటే వేటు వేయమని వారు స్పీకర్‌ను కోరేందుకే భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అనర్హత పిటిషన్లను పెండింగులో పెట్టవద్దని వారు స్పీకర్‌ను కోరనున్నారు. ఈ నెల 29వ తేదిలోగా స్పీకర్ ముందు వారు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉండగా అంతకుముందే ఆయనను కలిసి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారికి ఇప్పటి వరకు నాదెండ్ల పాయింట్‌మెంట్ దొరకలేదు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిసి వారు ఇదే విషయాన్ని చెప్పే అవకాశముంది.












Click it and Unblock the Notifications