చిరుకు పదవిని అడ్డుకోలేదు, విభేదాలు లేవు: కావూరి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఉంటే వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని, నిర్ణయాల విషయంలో ఏకాభిప్రాయ సాధనకే సమన్వయ కమిటీ పనిచేస్తుందని ఆయన చెప్పారు. సమన్వయ కమిటీ పార్టీ బలోపేతానికి పని చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యను ఇప్పట్లో తేల్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. జగన్‌ను ఎదుర్కోవడమే కాంగ్రెసు పనా అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో జగన్ పెద్ద సమస్య కారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications