మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, తగ్గను: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: మరోసారి తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. పార్లమెంటు, శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఈ దీక్ష ఉంటుందని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని విరమించేది లేదని, వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. విరామం, సమయం ఇచ్చామని, అయినా ఫలితం లభించడం లేదని ఆయన అన్నారు. జనవరిలో సంక్రాంతి పర్వదినం తర్వాత ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. జాప్యం చేస్తే విద్వేషాలు మరింత పెరుగుతాయని, భౌగోళిక ఎడబాటుకు సీమాంధ్ర నాయకులు అంగీరించాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ లెక్చరర్ల సంఘం క్యాలెండర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజా ఉద్యమాలదే విజయమని, చరిత్రలో ధర్మం, న్యాయమే గెలిచిందని ఆయన అన్నారు. పాండవులు ఐదుగురే అయినా ధర్మం వైపు ఉన్నారు కాబట్టి గెలిచారని ఆయన అన్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని సంతరించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణపై కాంగ్రెసు నాయకులు పలు రకాలుగా మాట్లాడుతున్నారని కెసిఆర్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ తప్ప జాతీయ పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. సమయం, సందర్భం చూసి గమ్యం దిశగా సాగాలని, గమ్యాన్ని ముద్దాడేవరకు ఎత్తిన పడికిలి దించేది లేదని ఆయన అన్నారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తోలు మందం ఉన్న ప్రభుత్వాలు, అప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉన్నాయని, అయినా ఉద్యమాన్ని వదిలేది లేదని, సూర్యుడు పశ్చిమాన ఉదయించినా సరే ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన అన్నారు. కెసిఆర్ మాట్లాడినా వార్తే, మాట్లాడకున్నా వార్తేనని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకుందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సాధించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాడాల్సిందేనని ఆయన అన్నారు. వెన్నెముక లేని తెలంగాణ నాయకులే తెలంగాణ శాపమని ఆయన అన్నారు. తాము విశ్వప్రయత్నం చేశామని, రాజీనామా చేయాలని సూచించామని, రాజీనామాలు చేస్తే మళ్లీ గెలిపిస్తామని చెప్పామని ఆయన అన్నారు. నిజస్వరూపాలు బయటపడిన తర్వాత కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మెడ కత్తి పెట్టి తెలంగాణ ఇవ్వాలంటే ఇబ్బందులుంటాయని ప్రధాని అన్నారని ఆయన చెప్పారు. అడిగినందువల్ల కేంద్రానికి సమయం ఇచ్చామని ఆయన చెప్పారు. సంక్రాంతి తర్వాత మరోసారి ఉద్యమించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తనకేమీ కాలేదని, తాను సరిగానే ఉన్నానని, తమ వ్యూహాలు తమకు ఉంటాయని ఆయన అన్నారు. \

తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేసిందే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. అన్నా హజారే మాకు మేనమామ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబే అని ఆయన అన్నారు. లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తేవాలంటే శాసనసభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారని ఆయన అన్నారు. నయవంచనకు మరోపేరు చంద్రబాబు అని ఆయన అన్నారు. తొట్టి గ్యాంగ్ కుక్కల కన్నా హీనంగా అరుస్తోందని ఆయన తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులను ఉద్దేశించి ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+