విదేశీ దుస్తులు ధరించే జగన్‌కు ఏం తెలుసు?: కొండ్రు

Kondru Murali
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ నేతలు సోమవారం విరుచుకు పడ్డారు. జగన్ ఎవరికీ అందుబాటులో ఉండకుండా సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారని ఎమ్మెల్యే వీర శివా రెడ్డి విమర్శించారు. ఎంపీ పదవి ఆయనకు కేవలం అలంకార ప్రాయమేనని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

కొండ్రు మురళి, గండ్ర వెంకట రమణా రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి మీడియా సమావేశంలో జగన్ తీరుపై వేరుగా మండిపడ్డారు. ఇంపోర్టెండ్ దుస్తులు వేసుకునే జగన్ పత్తి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరమని కొండ్రు ఎద్దేవా చేశారు. రైతుల గురించి జగన్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మాట్లాడే హక్కు లేదన్నారు. రైతులు, ఓదార్పు పేరుతో జగన్ చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు నమ్మరన్నారు. టమాటా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం కొత్తకాదని బాబు, దివంగత వైయస్ హయాంలోనూ ఈ సమస్య ఉందన్నారు.

జగన్ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవడం ఓ నాటకమని కొట్టి పారేశారు. రాజకీయ లబ్ది కోసమే వారు కలిసే నాటకం ఆడుతున్నారన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించే ప్రసక్తి లేదన్నారు. జగన్, చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. కిరణ్ సర్కారు రైతుల పక్షపాతి అన్నారు. కాంగ్రెసు ఎప్పుడూ రైతుల శ్రేయస్సు కోరుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+