కెసిఆర్‌తో జగన్‌కు మ్యాచ్ ఫిక్సింగ్ లేదు: కొండా సురేఖ

తెలంగాణ సెంటిమెంట్ టిఆర్ఎస్ సొత్తు కాదన్నారు. తెలంగాణ కోసం ఇప్పటికే తాను రాజీనామా చేశానని, ఇప్పుడు అనర్హత పిటిషన్ ఇచ్చారన్నారు. దేనిపై నిర్ణయం తీసుకోవాలో స్పీకర్ ఇష్టమన్నారు. జగన్ తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తారని చెప్పారు. తెలంగాణ రావణకాష్టంలా మారినా కాంగ్రెసు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా అంతకుముందు బాలినేని, ప్రసాద రాజు మాట్లాడారు. తమపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. విప్ ధిక్కారంపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఆయనపై తమకు నమ్మకముందన్నారు. తమపై అనర్హత వేటు పడుతుందనే తాము భావిస్తున్నామన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఓదార్పు యాత్రలో ఉండటం చేత స్పీకర్ వద్దకు రాలేదని, మరికొందరు 29లోగా స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా వివరణ ఇస్తారని, విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలంతా జగన్ వెంటే ఉన్నారన్నారు.
కాగా స్పీకర్‌ను పన్నెండు మంది శాసనసభ్యులు కలిశారు. వారిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, గొల్ల బాబూరావు, రామకృష్ణా రెడ్డి, ప్రసాద రాజు, శోభా నాగి రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, సుచరిత, ధర్మాన కృష్ణదాసు, అమర్నాథ్ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.












Click it and Unblock the Notifications